తెలంగాణ

telangana

Cash Seize in Sirpur Constituency

ETV Bharat / videos

సిర్పూర్​లో పోలీసుల తనిఖీల్లో- రూ.56 లక్షల నగదు స్వాధీనం - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు

By ETV Bharat Telangana Team

Published : Nov 29, 2023, 10:31 PM IST

Cash Seize in Sirpur Constituency :రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్​కు వేళైంది. ప్రలోభాల పర్వం జోరుగా నడుస్తోంది. రేపే పోలింగ్​ డే కావడంతో.. నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. పోలీసుల కళ్లుగప్పి ఓటర్లకు పంచేందుకు డబ్బు రవాణా చేస్తున్నారు. తాజాగా కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలో పోలీసుల తనిఖీల్లో.. ఆటోలో రవాణా చేస్తున్న రూ. 56 లక్షల నగదు పట్టుబడింది. 

Cash Seize in Kumaram Bheem Asifabad :పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాగజ్​నగర్ పట్టణం నుంచి సిర్పూర్. టి వైపు వెళుతున్న.. ఒక ఆటోలో పోలీసులు తనిఖీ చేయగా నూనె ప్యాకెట్​లు తీసుకువెళ్లే కాటన్ డబ్బాలలో నగదు లభించింది. డబ్బు, ఆటోను స్వాధీనపర్చుకున్నారు. అనంతరం డ్రైవర్​ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాగజ్​నగర్​లో ఇద్దరు వ్యక్తులు నూనె  కాటన్ డబ్బాలను.. సిర్పూర్​లో మరో వ్యక్తికి అందించాలని అన్నారని, కాటన్ డబ్బాలలో డబ్బులు ఉన్న విషయం తనకు తెలియదని నిందితుడు తెలిపాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన అధికారులు, విచారణ ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details