తెలంగాణ

telangana

Case Registered against Padi Kaushik Reddy

ETV Bharat / videos

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు - బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి

By ETV Bharat Telangana Team

Published : Dec 4, 2023, 7:37 PM IST

Case Registered against Padi Kaushik Reddy :హుజూరాబాద్ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడికౌశిక్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలక్షన్‌ కోడ్‌ ఉల్లంఘించడంతో పాటు తమ విధులకు ఆటంకం కలిగించినందుకు గానూ కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. 

BRS MLAPadi Kaushik Reddy :ఓట్ల లెక్కింపు రోజు కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండగా కౌశిక్‌రెడ్డి కార్యకర్తలు గుంపులు గుంపులుగా చేరడంతో పోలీసులు అడ్డుకునే యత్నం చేశారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. కౌశిక్​ రెడ్డి పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడు. దీంతో పోలీసులు వారందరిని అక్కడి నుంచి చెదరగొట్టారు. ఇవాళ ఎన్నికల నియమావళి ఉల్లంఘనతో పాటు పోలీసుల విధులకు ఆటంకం కల్పించారని పాడికౌశిక్‌రెడ్డితో పాటు ఆయన అనుచరులపై 506,290,303 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

ABOUT THE AUTHOR

...view details