తెలంగాణ

telangana

carpenter made wooden treadmill

ETV Bharat / videos

అతి చౌకైన ట్రెడ్​మిల్​- ఇంట్లోనే చెక్కతో తయారు చేసుకోవచ్చట! - చెక్క ట్రెడ్​మిల్​ను రూపొందించన వడ్రంగి

By ETV Bharat Telugu Team

Published : Dec 8, 2023, 3:39 PM IST

Carpenter Made Wooden Treadmill : కేరళ కన్నూర్ జిల్లాలోని చాలోడే పట్టణానికి చెందిన సంతోశ్​ అనే వడ్రంగి చెక్కతో ట్రెడ్​మిల్​ను రూపొందించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. రోజువారీ వ్యాయామాల కోసం దీనిని సులువుగా ఉపయోగించుకోవచ్చని చెబుతున్నాడు. మార్నింగ్​ వాక్​కు వెళ్లే క్రమంలో వీధి కుక్కలతో అనేక ఇబ్బందులు పడి అది కూడా మానేశాడు. ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం కనుగోనాలని భావించి అతి చౌక ధరతో చెక్క ట్రెడ్​మిల్​ను రూపొందించాడు.

"మార్నింగ్​ వాక్​కు వెళ్తుంటే వీధి కుక్కల సమస్య వెంటాడుతోంది. అందుకు పరిష్కారంగానే దీనిని రూపొందించాను. దీనిని తయారు చేశాక ఫేస్​బుక్​లో పోస్ట్ చేశాను. ఈ ట్రెడ్​మిల్​ చాలా మందికి నచ్చినా,  ఎక్కువగా శబ్దం వస్తుందని చెప్పేవారు. ఈ సమస్యను పరిష్కరించి శబ్దం తక్కువ వచ్చేలా మార్చాను."

--సంతోశ్​, వడ్రంగి

చెక్కతో తయారు చేసిన ఈ ప్రత్యేక ట్రెడ్​మిల్​ను వినియోగించడానికి ఎలాంటి విద్యుత్​ అవసరం లేదు. తక్కువ ఖర్చుతో రూపొందించిన ఈ ట్రెడ్​మిల్​ అనేక మందిని ఆకర్షిస్తోంది.

"చాలా మంది ఈ ట్రెడ్​మిల్​ను కొనేందుకు ఆసక్తి చూపించారు. ఇప్పటికే 4-5 ట్రెడ్​మిల్​లను డెలివరీ చేశాం. ఇంకా చాలా మంది ఇలాంటి ట్రెడ్​మిల్​ను తయారు చేయాలని కోరుతున్నారు."

--సంతోశ్​, వడ్రంగి

ట్రెడ్​మిల్​ మాత్రమే కాకుండా ఇతర వస్తువులను రూపొందించాడు సంతోశ్. వెన్ను నొప్పితో బాధపడే వారి కోసం ప్రత్యేకంగా ఓ కుర్చీని సైతం తయారు చేశాడు.

ABOUT THE AUTHOR

...view details