కరెంట్ వైర్లలో చిక్కుకున్న కారు తాళం తీస్తూ ఒకరు మృతి - కారు తాళం తీయబోయి కరెంట్ షాక్
కరెంట్ షాక్ తగిలి మల్లప్ప అనే వ్యక్తి మృతి చెందిన ఘటన కర్ణాటకలోని హాసన్ జిల్లాలో జరిగింది. ఇంటి ముందున్న కరెంట్ వైర్లలో చిక్కుకున్న కారు తాళాన్ని తీసే ప్రయత్నంలో ఈ ఘటన జరిగింది. తాళాన్ని ఇల్లు తుడిచే కర్రతో తీయబోయిన మల్లప్ప షాక్‌తో అక్కడికక్కడే మరణించాడు. ఉదయగిరి లేఅవుట్లో నివాసం ఉంటున్న మల్లప్ప స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తున్నాడు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST