తెలంగాణ

telangana

Car Killed Pedestrian Video

ETV Bharat / videos

Car Killed Pedestrian Video : పాదచారుడిపైకి దూసుకెళ్లిన కారు.. అమాంతం గాల్లోకి ఎగిరి వ్యక్తి మృతి - చెన్నై కారు ప్రమాదం వీడియో

By ETV Bharat Telugu Team

Published : Sep 28, 2023, 11:00 PM IST

Car Killed Pedestrian Video : తమిళనాడులోని చెన్నైలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి పాదచారుడి పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్​ను పోలీసులు అరెస్టు చేశారు.

ఇదీ జరిగింది..
చెన్నై పురసావల్కం ప్రాంతానికి చెందిన జయకుమార్​ (47) సౌగర్​పేటైలో ఓ కెమికల్ కంపెనీ నిర్వహిస్తున్నాడు. బుధవారం (సెప్టెంబర్ 27) సాయంత్రం కిల్పాం నుంచి కెల్లీస్​ ప్రాంతానికి కారులో బయలుదేరాడు. ఈ క్రమంలోనే రాంగ్​ వేలో వెళ్తున్న అతడి కారు అదుపుతప్పి.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న పళని అనే వ్యక్తి పైకి వేగంగా దూసుకెళ్లింది. దీంతో అమాంతం ఎగిరి కింద పడిన పళని.. అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి కిల్పాం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో ఓ అటోతో పాటు పలు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ ఘటనకు కారణమాని జయకుమార్​ను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details