Car Hits Constable in Secunderabad Video Viral : వాహన తనిఖీలు చేస్తుండగా కానిస్టేబుల్ పైనుంచి దూసుకెళ్లిన కారు.. - The car that hit the constable
Published : Oct 20, 2023, 1:34 PM IST
Car Hits Constable in Secunderabad Video Viral :రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగడంతో.. పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ మోహరించిన పోలీసులు.. ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. పలుచోట్ల అక్రమంగా తరలిస్తున్న భారీ నగదు, మద్యం, బంగారం వంటి విలువైన వస్తువులు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో.. వాహన తనిఖీలు చేస్తున్న సమయంలో ఓ కానిస్టేబుల్‌ను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి.
గురువారం రాత్రి రెండు గంటల సమయంలో ఆలుగడ్డ వద్ద ఎన్నికల కోడ్ నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆలుగడ్డ మీదుగా వస్తున్న కారును ఆపే ప్రయత్నం చేయగా.. డ్రైవర్ అతివేగంగా వచ్చి కానిస్టేబుల్ మహేశ్‌ను ఢీ కొట్టాడు. తీవ్ర గాయాలు కావడంతో వైద్య చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రమాద ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదు అయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న గోపాలపురం పోలీసులు కారును గుర్తించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.