తెలంగాణ

telangana

ETV Bharat / videos

సచివాలయం వద్ద కారులో మంటలు - క్షణంలో దగ్ధమైన వాహనం - సచివాలయంలో కారులో మంటలు

🎬 Watch Now: Feature Video

Car Fire Accident at Telangana Secretariat

By ETV Bharat Telugu Team

Published : Dec 27, 2023, 6:14 PM IST

Car Fire Hyderabad Today :హైదరాబాద్ సచివాలయం వెనుక మింట్ కాంపౌండ్​లో ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మొదట కారు ఇంజిన్​ నుంచి మంటలు మొదలై క్రమంగా పెద్ద ఎత్తున అలుముకున్నాయి. దీంతో కారు పూర్తిగా కాలిపోయింది. వెంటనే అక్కడున్న స్థానికులు భయాందోళనకు గురై అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న జీహెచ్​ఎంసీ వాటర్​ ట్యాంకర్​, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

Accident at Telangana Secretariat :మంటలు చేలరేగిన సమయానికి కారులో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఖైరతాబాద్​ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. కారులో మంటలు రావడానికి గల కారణాలేంటి అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాధారణంగా ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల వాహనాల్లో మంటలు చెలరేగుతాయి. కానీ ఇప్పుడున్న తక్కువ ఉష్ణోగ్రతల సమయంలో కూడా కారులో మంటలు రావడంతో వాహనదారులను భయాందోళనకు గురి చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details