వంతెనపై నుంచి కదులుతున్న రైలుపై పడ్డ కారు, ముగ్గురు మృతి - కర్జాత్‌లో కారు ప్రమాదం
Published : Nov 8, 2023, 8:41 AM IST
Car Falls Onto Moving Goods Train :వంతెనపై నుంచి అదుపుతప్పి ట్రాక్‌పై వెళ్తున్న గూడ్స్ ట్రైన్‌పై పడిపోయింది ఓ కారు. రైలును ఢీకొట్టడం వల్ల కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో మంగళవారం జరిగింది.
ఇన్నోవా కారులో ఐదుగురు వ్యక్తులు ముంబయి నుంచి నేరల్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున సుమారు మూడున్నర గంటల సమయంలో కర్జాత్ ప్రాంతంలోని కిర్వాలీ బ్రిడ్జిపైకి రాగానే కారు అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీ కొట్టింది. అనంతరం 30 అడుగుల పైనుంచి కిందికి పడిపోయింది. అదేసమయంలో, కర్జాత్ నుంచి పన్వేల్‌కు వెళ్తున్న గూడ్స్ వంతెన కింద ట్రాక్‌పై ప్రయాణిస్తోంది. గూడ్స్ రైలుపై కారు పడడం వల్ల.. దాని బోగీలు కొన్ని విడిపోయాయి. ప్రమాదం అనంతరం రైలు అక్కడే ఆగింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీ సాయంతో కారును పైకి తీశారు. అందులో ఉన్న ఐదుగురు వ్యక్తులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. చిక్సిత పొందుతూ ముగ్గురు వ్యక్తులు మరణించారు. మిగిలిన ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం వేరే ఆసుపత్రికి పంపించారు. మృతులు అంతా ఒకే కుంటుంబానికి చెందిన వారని పోలీసులు తెలిపారు.