స్టూడెంట్ను ఢీకొని కి.మీ ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్‌ను చితక్కొట్టిన స్థానికులు - హర్దోయూలో యువకుడిని ఈడ్చుకెళ్లిన కారు వీడియో
దిల్లీలో ఓ యువతిని కారుతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన ఘటన మరువక ముందే ఉత్తర్‌ప్రదేశ్‌లో అలాంటి ఘటనే జరిగింది. హర్దోయీ జిల్లాలో సైకిల్‌పై వెళ్తున్న ఓ విద్యార్థిని కారు ఢీకొట్టింది. అనంతరం కిలో మీటర్ వరకు ఈడ్చుకెళ్లింది. దీన్ని గమనించిన స్థానికులు వెంటపడి కారును అడ్డుకున్నారు. ఆ విద్యార్థిని రక్షించారు. కారును ధ్వంసం చేసి డ్రైవర్‌కు దేహశుద్ధి చేశారు. గాయపడిన విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST