కారులో మంటలు.. కాన్వాయ్ ఆపి సీఎం పరామర్శ.. ఆదుకుంటానని హామీ! - డ్రైవర్‌తో మాట్లాడిన సీఎం ఏక్నాథ్ శిందే
మహారాష్ట్ర ముంబయి వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేపై వెళ్తున్న ఓ లగ్జరీ కారులో అకస్మికంగా మంటలు వ్యాపించాయి. అదేసమయంలో అటుగా వెళ్తున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే.. మంటల్లో కాలిపోతున్న కారును చూసి తన కాన్వాయ్‌ను ఆపించారు. అనంతరం, మంటల్లో చిక్కుకున్న కారు డ్రైవర్ విక్రాంత్ శిందేతో మాట్లాడారు. మంటల వద్దకు వెళ్లొద్దని.. ప్రాణమే ముఖ్యమని సీఎం శిందే తనతో అన్నారని విక్రాంత్ తెలిపాడు. సాయం చేస్తానని సీఎం శిందే హామీ ఇచ్చారని వెల్లడించాడు. సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిందీ ఘటన. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లను తెచ్చి.. మంటలను అదుపులోకి తెచ్చారు. సీఎం శిందే.. కారు డ్రైవర్‌తో మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST