తెలంగాణ

telangana

Car Fire Accident In Rangareddy

ETV Bharat / videos

Car Burnt at Kothagudem : సడెన్​గా కారులో మంటలు.. చూస్తుండగానే పూర్తిగా దగ్ధం.. లక్కీగా.. - రంగారెడ్డి జిల్లాలో కారు ప్రమాదం

By

Published : Aug 11, 2023, 9:26 PM IST

Car Burnt at Kothagudem : నడిరోడ్డుపై కారు పూర్తిగా దగ్ధమైన ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్టు మండలం కొత్తగూడెం వద్ద చోటుచేసుకుంది. హైదరాబాద్​-విజయవాడ జాతీయ రహదారిపై కారు మంటల్లో చిక్కుకుని పూర్తిగా కాలిపోయింది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అబ్దుల్లాపూర్​మెట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలానగర్​కు చెందిన జ్ఞాని వంశీధర్​ రెడ్డి కారు(TS 08 HQ1903)ను రెండు రోజుల క్రితం అతని స్నేహితుడైన ధరావత్​ శివాజీ లాంగ్​ డ్రైవ్​ నిమిత్తం విజయవాడకు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణం నిమిత్తం హైదరాబాద్​ వస్తుండగా అబ్దుల్లాపూర్​మెట్​ సమీపంలోని అన్నమాచార్య ఇంజినీరింగ్​ కాలేజ్​ వద్ద ఇంజిన్​ నుంచి మంటలు రావడంతో.. అప్రమత్తమైన శివాజీ కారును వెంటనే ఆపి అందులో నుంచి దిగిపోయాడు. మంటలు ఎక్కువగా వ్యాపించి కారు పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది.

ABOUT THE AUTHOR

...view details