తెలంగాణ

telangana

Car Accident In Bengaluru

ETV Bharat / videos

లైవ్ వీడియో- 3 బైక్​లపైకి దూసుకెళ్లిన SUV - బెంగళూరులో బైక్​లను ఢీకొనిన కారు

By ETV Bharat Telugu Team

Published : Nov 13, 2023, 1:33 PM IST

Car Accident In Bengaluru: అతివేగంగా వస్తున్న ఓ కారు మూడు బైక్​లను ఢీకొనగా నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

బెంగళూరులోని హుళిమావు సమీపంలో ఓ ఎస్​యూవీ కారు అదపుతప్పి ముందు ఉన్న ఓ బైక్​ను ఢీకొంది. అయినా ఆగకుండా అలానే మరో రెండు బైక్​లను ఢీకొట్టుకుంటూ ముందుకు వెళ్లిపోయింది. ఈ దృశ్యాలను వెనుక వాహనంలో ఉన్న వారు రికార్డు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​ అవుతోంది. కారు డ్రైవర్​ అభిషేక్ అగర్వాల్ కారుపై నియంత్రణ కొల్పోవటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. అదుపుతప్పిన కారు ఢీ కొనడం వల్ల బైక్​పై వెళ్తున్న ఇద్దురు వ్యక్తుల్లో ఒకరు కిందకు దూకేశారని.. మరో ముగ్గురు గాయపడ్డారు అని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ABOUT THE AUTHOR

...view details