ప్రభుత్వ పథకాలు పేదలకు అందడం లేదు : బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేశ్ - కంటోన్మెంట్ లెటెస్ట్ న్యూస్
Published : Nov 23, 2023, 1:28 PM IST
CantonmentBJP Candidate Ganesh Interview :అభివృద్ధిలో కంటోన్మెంట్ నియోజకవర్గం కుంటుపడిపోయిందని.. తనకు అవకాశం కల్పిస్తే ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ హామీ ఇచ్చారు. కరోనా సమయంలో ప్రజలతో ఉండి.. వారికి కావాల్సిన సాయాన్ని తాను స్థాపించిన శ్రీగణేష్ ఫౌండేషన్ ద్వారా అందించానని తెలిపారు. రాష్ట్రంలో చదువుకున్న యువత నిరుద్యోగులుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలు.. బీఆర్ఎస్ పథకాలుగా మారాయని అవి ఆ పార్టీ లీడర్లకు తప్ప పేదలకు అందడంలేదని ఆరోపించారు.
BJP Election Campaign In Telangana : తాగునీరు కూడా 4, 5 రోజులకు ఒకసారి వస్తోందని.. కంటోన్మెంట్‌కు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతో ఉందని గణేశ్ అభిప్రాయపడ్డారు. ఈ పదేళ్లలో అభివృద్ధి ఏ మాత్రం జరగలేదని.. ఏక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఉందని.. ఆరోపించారు. జీహెచ్ఎంసీలో అందుతున్న అన్ని సౌకర్యాలను కంటోన్మెంట్లో అమలు చేసి.. మరింత అభివృద్ధి చేస్తానని చెబుతున్న నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్యే శ్రీగణేశ్‌తో ముఖాముఖి.