తెలంగాణ

telangana

Can Too Much Tea Cause Diabetes

ETV Bharat / videos

Can Too Much Tea Cause Diabetes : రోజుకు 'టీ' ఎన్నిసార్లు తాగొచ్చు?.. ఎక్కువగా తాగితే డయాబెటిస్​​ వస్తుందా?

By ETV Bharat Telugu Team

Published : Oct 16, 2023, 7:38 AM IST

Can Too Much Tea Cause Diabetes :సాధారణంగా కొందరు రోజుకు రెండు మూడు సార్లు టీ తాగుతుంటారు. మరికొందరు ఎక్కువ సార్లు సేవిస్తుంటారు. అయితే టీ ఎక్కువ సార్లు తాగితే శరీరానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కొందరికి డయాబెటిస్​ కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు.

'టీ ఎక్కువగా తాగితే ఎన్నో ఇబ్బందులు!'
Drinking Too Much Tea Side Effects : "ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఇంటి నుంచే పనిచేస్తున్నారు. దీని వల్ల ప్రాథమికంగా అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో ఉండి ఎక్కువగా ఆహారం తినేస్తున్నారు. శారీరకంగా ఎలాంటి కసరత్తులు చేయకపోవడం వల్ల వారికి ఊబకాయం వస్తోంది. అందుకే రోజుకు కచ్చితంగా 45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. మనం తీసుకునే ఆహారంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి. టీ వల్లే కాదు ఎక్కువగా స్వీట్స్​ తినడం వల్ల కూడా డయాబెటిస్​ వచ్చే అవకాశం ఉంది. రోజుకు రెండు నుంచి మూడు సార్లు మాత్రమే టీ తాగాలి. అంతకన్నా ఎక్కువ సార్లు తాగితే ప్రీ- డయాబెటిస్​ బారిన పడొచ్చు. అయితే మధుమేహం వ్యాధి​ వచ్చినట్లు అనుమానం వస్తే దగర్లో ఉన్న వైద్యుడిని సంప్రదించాలి. వైద్యులు సూచించిన అన్ని పరీక్షలు చేయించుకోవాలి. వాటి నివేదికల బట్టి జాగ్రత్తలు తీసుకోవాలి" అని నిపుణులు ప్రవీణ్​ కుమార్​ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details