తెలంగాణ

telangana

Diabetes Medicines Gas Problems

ETV Bharat / videos

Can Diabetes Medicines Cause Gas Problems : డయాబెటిస్​ మందులు వాడితే గ్యాస్ట్రిక్​ సమస్యలు వస్తాయా..? నిజమెంత? - sugar tablets side effects in telugu

By ETV Bharat Telugu Team

Published : Oct 27, 2023, 7:34 AM IST

Updated : Oct 27, 2023, 8:19 AM IST

Can Diabetes Medicines Cause Gas Problems :దీర్ఘకాలంగా మధుమేహంతో బాధపడేవారు తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన జాగ్రత్తల్లో షుగర్​ను అదుపులో ఉంచుకోవడం. దీంతో పాటు HBA1C లాంటి పరీక్షలను ప్రతి మూడు నెలలకోసారి చెయించుకోవాలి. అయితే HBA1C లెవెల్​ అనేది 7 లేదా అంతకంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం ఆహారం తినడంలో నియంత్రణ పాటించడం, రోజూ వ్యాయామాలు చేయడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించడం, యోగా చేయడం లాంటివి చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే మీ షుగర్​ లెవెల్స్​ కంట్రోల్​లో ఉంటాయి. ఇలా తరచూ చేయించుకునే పలు రకాల టెస్టుల వల్ల మన శరీరంలో ఏమైనా అవయవాలు దెబ్బతిన్నాయా లేదా అనేది సులువుగా తెలుసుకోవచ్చు. కళ్లకు చేసే ఫండస్​ పరీక్ష​.. రెటీనా ఏమైనా డ్యామేజ్​ అయిందా అనే విషయాన్ని తెలియజేస్తుంది. గుండెకు సంబంధించిన డ్యామేజీని అంచనా వేయడానికి ట్రెడ్​మిల్​ పరీక్ష, కిడ్నీకి సంబంధించి సీరమ్​ క్రియాటినిన్​, రక్తనాళాలకు సంబంధించి ఇతర పరీక్షలు ఇలా అవసరాన్ని బట్టి ప్రతి ఆరునెలలకోసారి టెస్ట్​​ చేయించుకుంటే మంచిది. వీటితో పాటు దీర్ఘకాల షుగర్​ వ్యాధిగ్రస్తులు తమ శరీరంలో రోగనిరధక శక్తి తగ్గిందని అనిపిస్తే వైద్యుల సలహా మేరకు కొన్ని రకాల వ్యాక్సిన్​లను తీసుకుంటే మంచిది. అయితే షుగర్​కు వాడే మందుల వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయా? షుగర్ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్​ ఏమైనా వస్తాయో లేదో తెలుసుకోవడం కోసం ఈ పూర్తి వీడియో చూసేయండి. 

Last Updated : Oct 27, 2023, 8:19 AM IST

ABOUT THE AUTHOR

...view details