ప్రయాణికుడిపై కండక్టర్ దాడి.. కాలితో ఛాతీపై తన్ని.. - కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లా న్యూస్
కర్ణాటకలో ఆర్టీసీ బస్సు కండక్టర్.. ప్రయాణికుడి పట్ల దారుణంగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో బస్సు ఎక్కిన ప్రయాణికుడితో వాగ్వాదానికి దిగాడు. ప్రయాణికుడి.. గొడుగును బయటకు విసిరేశాడు. అక్కడితో ఆగకుండా బస్సు ఎక్కిన ప్రయాణికుడి ఛాతీపై కాలితో తన్ని బలవంతంగా బయటకు నెట్టేశాడు. ఈ ఘటన దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు సమీపంలోని ఈశ్వరమంగళలో బుధవారం జరిగింది. రోడ్డుపై పడిపోయిన ప్రయాణికుడిని వదిలేసి బస్సు ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయింది. ఈ విషయం ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి చేరడం వల్ల కండక్టర్ సుబ్బరాజ్ను సస్పెండ్ చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST