Bus accident in Sultanabad : ఆటో తప్పించబోయి ఆర్టీసీ బస్సు బోల్తా.. 40 మందికి గాయాలు - Bus accident in Peddapally district
Bus accident at Katnapalli, Peddapally district : హైదరాబాద్లో జరిగిన బంధువుల పెళ్లికి వెళ్లి తిరిగివస్తుండగా.. డివైడర్ను ఢీకొట్టి బస్సు బోల్తాపడిన ఘటన సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద చోటుచేసుకుంది. పెద్దపల్లి జిల్లా రామగుండంకు చెందిన ముస్లిం కుటుంబం బంధువులతో కలిసి హైదరాబాద్కు పెళ్లికి వెళ్లి.. సోమవారం రామగుండంకు తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో కాట్నపల్లి గ్రామం వద్ద అకస్మాత్తుగా ఆటో ఎదురుకావడంతో.. డ్రైవర్ దానిని తప్పించవడంతో బస్సు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 40 మందికి పైగా ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. ఒక మహిళ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు హూటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పెద్దపల్లి ఏసీపీ మహేష్, సుల్తానాబాద్ సీఐ జగదీష్, ఎస్ఐ విజయేందర్లు సంఘటన చోటుకు చేరుకొని ప్రమాద తీవ్రతను పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఏసీపీ మహేష్ తెలిపారు.