తెలంగాణ

telangana

Burst Fresh Water Pipe Line In Hyderabad

ETV Bharat / videos

Water Pipe Line Burst in Hyderabad : పైప్ లైన్ లీక్.. పాతాళగంగలా ఉవ్వెత్తున ఎగిసిపడ్డ నీరు - Broken Krishna water pipe line

By

Published : Jun 22, 2023, 10:31 AM IST

Water Pipe Line Burst at Budvel in Hyderabad : హైదరాబాద్ నగర శివారు రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని బుద్వేల్ గ్రామం సమీపంలో కృష్ణ వాటర్ మంచినీటి పైప్ లైన్​ పగిలింది. పైపుల నాణ్యతలో లోపమో లేదా ఆకతాయిల పనో తెలియదుకానీ, పెద్దమొత్తంలో నీరైతే బయటకు వృథాగా పోయింది. పైప్ ​లైన్​ నుంచి వచ్చే నీరు ఒత్తిడి వల్ల ఉవ్వెత్తున ఎగిసిపడింది. సుమారుగా రెండు, మూడు గంటలుగా మంచినీరు వృథాగా పోతున్నాగానీ  జలమండలి అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదు. డైరీ ఫార్మ్ చౌరస్తా నుంచి రాజేంద్రనగర్​కు వెళ్లే దారిలో పెద్ద సంఖ్యలో నీళ్లు ఎగిసిపడ్డాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

ఆ మార్గంలో వెళ్లిన వాహనదారులపై నీరు పడటంతో వారు తడిసిముద్దయ్యారు. వేరే మార్గం లేకపోవడంతో వాహనదారులు తడుచుకుంటూనే వెళ్లారు. ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్న నీళ్లు చూసి స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. నీరంతా వృథాగా పోవడం పట్ల విచారం చెందారు.  "అధికారులు దీనిపై చర్యలు తీసుకుని రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి" అని దారిన వేళ్లే ఒక వాహనదారుడు పేర్కొన్నారు. గంటల తరబడి నీళ్లు వృథాగా పోతున్న పట్టించుకొని అధికారుల నిర్లక్యంపై మరికొంత మంది మండిపడుతున్నారు.  

ABOUT THE AUTHOR

...view details