40 కేజీల బాహుబలి బర్గర్ ఎన్ని కిలోల సాస్ వాడారో తెలుసా
పంజాబ్‌లోని హోశియార్పుర్కు చెందిన బర్గర్ చాచూ దేశంలోనే అతిపెద్ద బర్గర్ తయారు చేసి రికార్డు సృష్టించారు. 40 కేజీలకు పైగా బరువున్న బర్గర్‌ను సిద్ధం చేసి వార్తల్లోకెక్కాడు. దేశంలోనే అతిపెద్ద బర్గర్ ఇదేనని చెబుతున్నాడు చాచూ. కొత్తది ఏదైనా చేయాలన్న ఆలోచనతో అతిపెద్ద బర్గర్ రూపొందించినట్లు చెప్పాడు చాచూ. ఈ బర్గర్ కోసం 12కేజీల బన్, దాదాపు ఏడు కేజీల కూరగాయలు, అంతే మొత్తంలో సాస్ ఉపయోగించాడు. కేజీ చీజ్‌ను బర్గర్లో వాడాడు. ఈ బాహుబలి బర్గర్‌ను చూసేందుకు స్థానికులు, ఆహార ప్రియులు పోటెత్తారు. ఇదివరకు ఆరు భారీ బర్గర్లను తయారు చేశాడు చాచూ. నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా చాచూ బర్గర్ తయారు చేశాడని స్థానికులు చెబుతున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST