BRAVE LADY Kavitha : ఎమ్మెల్సీ కవితకు మద్దతుగా హైదరాబాద్‌లో పోస్టర్లు - BRAVE LADY
BRS set up posters in Hyderabad in support of MLC Kavitha: ఈడీ విచారణ కోసం దిల్లీ వెళ్లిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులు హైదరాబాద్‌లో పోస్టర్లు ఏర్పాటు చేశారు. బీజేపీ నాయకత్వం ఎన్ని కుట్రలు చేసినా లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత నిర్దోషిగా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, మాజీ గ్రంథాలయ ఛైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరిట అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పోస్టర్లు ఏర్పాటు చేశారు.
మరోవైపు ఎమ్మెల్సీ కవిత నేడు ఈడీ విచారణ నేపథ్యంలో నిన్న రాత్రి దిల్లీ వెళ్లారు. ఆమె వెంట భర్త అనిల్, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోశ్ కుమార్ ఉన్నారు. ఆమె ఈనెల 16వ తేదీన ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికి అనారోగ్య కారణాలతో హాజరు కాలేకపోయారు. ఈడీ.. ఇవాళ వ్యక్తి గతంగా హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆమె ఇవాళ ఈడీ విచారణకు హాజరు అవుతారా లేదా.. అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.