తెలంగాణ

telangana

BRS Reacts on Governor Assembly Speech Today

ETV Bharat / videos

గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ మేనిఫెస్టో చదివినట్లుగా ఉంది : కడియం శ్రీహరి - BRS reacts to Governor Tamilisai Assembly speech

By ETV Bharat Telangana Team

Published : Dec 15, 2023, 2:01 PM IST

BRS Reacts on Governor Assembly Speech Today : శాసనసభ సమావేశంలో గవర్నర్‌ ప్రసంగం కాంగ్రెస్ మేనిఫెస్టో చదివినట్లుగా ఉందని స్టేషన్​ ఘన్​పూర్ బీఆర్ఎస్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన అనేక అభివృద్ధి పనులపై గవర్నర్‌ ప్రసంగించకపోవడం చాలా బాధాకరమైన విషయమని కడియం ఆవేదన వ్యక్తం చేశారు.

MLA Kadiyam Srihari reacts on Governor Speech : నూతన ప్రభుత్వం గవర్నర్‌తో అన్నీ అసత్యాలు పలికించిందని కడియం ఆరోపించారు. ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై గవర్నర్‌ సరిగా చెప్పలేదన్నారు. సర్కార్​ విధానాలపై స్పష్టమైన రోడ్‌ మ్యాప్ ప్రకటిస్తే బాగుండేదన్నారు. పదేళ్ల తర్వాత తెలంగాణ ప్రజలు స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నారని గవర్నర్ చెప్పడం విడ్డూరమని కొత్తగా రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నట్లు అబద్ధాలు చెప్పారన్నారు. అసత్యాలు చెప్పడం వల్ల గవర్నర్ పదవి అబాసు పాలవుతుంది తప్పితే శోభనీయదని స్పష్టం చేశారు. ప్రభుత్వం శ్వేత పత్రాలు ప్రకటించిన తర్వాత అన్ని అంశాలపై తాము మాట్లాడతామని తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details