BRS MLA Sunke Ravi Shankar Intresting Comments : 'మళ్లీ నాకే టికెట్.. పుకార్లను నమ్మొద్దు..' చొప్పదండి ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు - తెలంగాణ తాజా వార్తలు
BRS MLA Sunke Ravi Shankar Intresting Comments : కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ రానున్న ఎన్నికల్లో టికెట్ అంశంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బూరుగుపల్లిలో బీసీ బంధు చెక్కులు ఇస్తున్న సందర్భంగా సభలో ఆయన మాట్లాడుతూ ఈసారి ఎన్నికల్లో తనకే టికెట్ ఇస్తామని అధిష్ఠానం స్పష్టంగా చెప్పిందని.. అయినా కొంతమంది నాయకులు నా మీద కక్షతో వ్యతిరేకంగా టికెట్ రాదని ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మవద్దని కోరారు. ఎవరెన్ని చెప్పినా తాను చేసిన అభివృద్ధి పనులను ప్రజలు గమనిస్తున్నారని.. ఆ అభివృద్దిని ఓర్వలేకే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈసారి కూడా సిట్టింగులకే టికెట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారని తనకు టికెట్ వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో కూడా తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ విజయబాటలో సాగి.. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.