తెలంగాణ

telangana

BRS MLA KTR Fires on CM Revanth Reddy

ETV Bharat / videos

'సీఎం రేవంత్​ రెడ్డికి పంటల బీమాకు, రైతు బీమాకు తేడా తెలియదు' - సీఎం రేవంత్​ రెడ్డిపై కేటీఆర్​ ఫైర్​

By ETV Bharat Telangana Team

Published : Dec 16, 2023, 5:29 PM IST

BRS MLA KTR Fires on CM Revanth Reddy : సీఎం రేవంత్​ రెడ్డికి పంటల బీమాకు, రైతు బీమాకు తేడా తెలియదని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే కేటీఆర్​ అన్నారు. అలాంటి నాయకుడు మీ నాయకుడు అంటూ సీఎం రేవంత్​ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్​ రెడ్డి ముఖ్యమంత్రిలా కాకుండా పీసీసీ అధ్యక్షుడిలా గాంధీభవన్​లో కూర్చున్నట్లు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వంలో పదేళ్లలో ఇసుకపై కేవలం రూ.39 కోట్ల ఆదాయమే వచ్చిందని ఎద్దేవా చేశారు. 

Telangana Assembly Sessions 2023 : ఈ లెక్కన చూసుకుంటే సంవత్సరానికి రూ. 4 కోట్లు కూడా రాలేదు. కానీ 2014 నుంచి బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో ఇసుకపై రూ.5 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని గుర్తు చేశారు. ఇసుక మాఫియా కాంగ్రెస్​ పార్టీది కాదా అంటూ ఆరోపించారు. ఇసుక మాఫియాపై కాంగ్రెస్​ 2018కి ముందు చెప్పింది ఆ తర్వాత చెప్పింది. ఈరోజు అధికారం మీ చేతిలో ఉంది ఏ విచారణ చేసుకుంటారో చేసుకొండి అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు.

ABOUT THE AUTHOR

...view details