రైతులకు బోనస్, రైతుబంధు ఎప్పుడు ఇస్తారు : హరీశ్‌రావు - రైతుబంధు పథకం
Published : Dec 9, 2023, 5:13 PM IST
BRS MLA Harish Rao on Rythu Bandhu : ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రకటించిన రైతు హామీలను ఎప్పుడు అమలు చేస్తారని రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నేత హరీశ్‌రావు ప్రశ్నించారు. సోనియాగాంధీ జన్మదిన సందర్భంగా ప్రభుత్వ నిర్ణయం కోసం రైతులంతా నిరీక్షిస్తున్నారని తెలిపారు. శాసనసభలో ప్రమాణస్వీకారాలు ముగిసిన తర్వాత హరీశ్‌రావు మీడియా పాయింట్ వద్దకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు.
ప్రచారంలో రూ.500 బోనస్ ఇచ్చి వడ్లను కొనుగోలు చేస్తామని, రూ.15 వేలు రైతుబంధు ఇస్తామని వెల్లడించారని ఆయన గుర్తు చేశారు. ధాన్యాన్ని అమ్ముకోవద్దని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బోనస్‌తో పాటు కొనుగోలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పారన్నారు. ఆ హామీలు ఎప్పుడు అమలవుతాయని ప్రశ్నించారు. తుపాను వల్ల వడ్లు తడిసిపోయి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని హరీశ్ ప్రభుత్వాన్ని కోరారు. మీడియా పాయింట్ వద్ద హరీశ్‌రావుతో పాటు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తదితరులు ఉన్నారు.