రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పార్టీనే ప్రజలు గెలిపిస్తారు : గంగుల కమలాకర్ - బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ ఇంటర్వ్యూ
Published : Nov 24, 2023, 8:51 AM IST
BRS MLA Candidate Gangula Kamalakar Interview : పోరాడి సాధించుకున్న తెలంగాణాను కాపాడుకోవడానికి మళ్లీ కేసీఆర్‌ను గెలిపించాలని కరీనంగర్ బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి గంగుల కమలాకర్ కోరారు. తాను గత తొమ్మిదేళ్లలో చేసిన అభివృద్ధే తనకు విజయాన్ని అందిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. రాబోయే కాలంలో చేయనున్న పనులను వివరిస్తూ ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. తాను చేసిన అభివృద్ధి చెప్పడానికి ఎన్నో పనులు కనిపిస్తున్నాయని.. ప్రత్యర్థులు ఏమి చెప్పి ఓటు అడుగుతారని ప్రశ్నించారు. తనపై ఆరోపణలు చేస్తున్న బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కు ఆదాయం ఎక్కడిదని ప్రశ్నించారు.
తన కుటుంబ సభ్యులు గ్రానైట్ వ్యాపారం చేసి డబ్బు సంపాదిస్తున్నారని గంగుల కమలాకర్ తెలిపారు. తనపై ఆరోపణలు చేస్తున్న వారికి కూడా ఆదాయం ఎక్కడిదో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణలో అభివృద్ధి చేసే పార్టీనే ప్రజలు గెలిపిస్తారని అన్నారు. తన నియోజకవర్గంలో రూ.మూడు కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తప్పకుండా భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.