తెలంగాణ

telangana

BRS Leaders Met DGP about Surya Naik Death Case

ETV Bharat / videos

సూర్య నాయక్‌ లాకప్​ డెత్​పై సమగ్ర దర్యాప్తు జరిపించాలి - డీజీపీకి బీఆర్​ఎస్​ నేతల వినతిపత్రం - సూర్యనాయక్ మృతిపై డీజీపీని కలిసిన బీఆర్‌ఎస్ నేతలు

By ETV Bharat Telangana Team

Published : Dec 14, 2023, 7:48 PM IST

BRS Leaders Met DGP about Surya Naik Death Case : భూ వివాదం కేసు విచారణలో చనిపోయిన సూర్య నాయక్‌ లాకప్​ డెత్​పై ఉన్నతాధికారులతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని బీఆర్‌ఎస్‌ నేతలు రాష్ట్ర డీజీపీ రవిగుప్తాకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మాజీ మంత్రి సత్యవతి రాఠోడ్ నేతృత్వంలో ఆయనను కలిసి వినతి పత్రం అందించారు. సూర్యనాయక్‌ మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకొని, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. లాకప్​ డెత్ విషయంలో డీజీపీ సానుకూలంగా స్పందించారని బీఆర్‌ఎస్‌ నేతలు సత్యవతి రాఠోడ్‌, బాల్క సుమన్, దాసోజు శ్రవణ్‌కుమార్‌ తెలిపారు. అన్నదమ్ముల పంచాయితీలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి గిరిజనుడి మృతికి కారణం అయ్యారని ఆరోపించారు. 

BRS Leaders Comments on Congress : మృతుడి కుటంబానికి తమ పార్టీ అండగా ఉంటుందని బీఆర్‌ఎస్‌ నేతలు అన్నారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ దారి తప్పుతుందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి పది రోజులు మాత్రమే అవుతుందని, అప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదన్నారు. కవ్వింపు చర్యల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి మచ్చ వస్తుందన్నారు. రాష్ట్రంలో శాంతి వాతావరణం ఉండాలని ఆకాంక్షించారు.

ABOUT THE AUTHOR

...view details