తెలంగాణ

telangana

BRS Leader Vinod kumar fires Congress Activists

ETV Bharat / videos

శిలాఫలకాలను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి : వినోద్‌కుమార్‌ - Dasyam Vinay Bhaskar press meet today

By ETV Bharat Telangana Team

Published : Dec 11, 2023, 5:24 PM IST

BRS Leader Vinod kumar fires Congress Activists :ప్రభుత్వ ఆస్తులను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధ్వంసం చేయడం బాధాకరమని కరీంనగర్‌ మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇష్టానుసారంగా వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో మాజీ చీఫ్‌ విప్ దాస్యం వినయ్‌ భాస్కర్, మాజీ విప్ గువ్వల బాలరాజు తదితర నేతలతో కలిసి అయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 

హనుమకొండ, అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాల శిలాఫలకాలను, ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ప్రగతి భవన్‌లో ఉన్న శిలాఫలకంపై కేసీఆర్ పేరును మట్టితో చెరిపివేయడం వంటి దుశ్చర్యలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్పడ్డారని అగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఇలాంటి చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావన్నారు. శిలాఫలకాలను ధ్వంసం చేసిన వారిపై కేసులను నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చేత ధ్వంసమైన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాల శిలాఫలకాలను తిరిగి పునరుద్ధరించాలని తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి నాలుగు రోజులు మాత్రమే అవుతున్నదని అలాంటప్పుడు వారిపై విమర్శలు చేయడం తమ ఉద్దేశం కాదన్నారు. 

ABOUT THE AUTHOR

...view details