BRS Human Resource center at Kokapet : బీఆర్ఎస్ మానవ వనరుల కేంద్రానికి కేసీఆర్ శంకుస్థాపన - BRS Human Resource center at Kokapet
Foundation of BRS Human Resource center in kokapet : భారత్ రాష్ట్ర సమితి ఏర్పాటు చేయతలపెట్టిన మానవ వనరుల కేంద్రానికి ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ భూమిపూజ చేశారు. పార్టీ నేతలకు, కార్యకర్తలకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేయనున్న ఈ కేంద్రం భవన నిర్మాణానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు. "ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్' పేరుతో హైదరాబాద్లోని కోకాపేటలో బీఆర్ఎస్ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది.
పార్టీ నేతలకు శిక్షణ, సంబంధిత కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా భవనాన్ని నిర్మించాలని బీఆర్ఎస్ నిర్ణయంచింది. ఇందుకోసం కోకాపేటలోని 239, 240 సర్వే నంబర్లకు చెందిన 11 ఎకరాల భూమిని బీఆర్ఎస్కు ఇటీవల మంత్రివర్గ సమావేశంలో కేటాయించారు. వీలైనంత త్వరగా నిర్మాణం చేపట్టాలన్న ఉద్దేశంతో వెంటనే భవన నిర్మాణం కోసం అనుమతులు తీసుకునే ప్రక్రియను చేపట్టారు. బీఆర్ఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ కోసం అన్ని రకాల అనుమతులు లభించినట్లు సమాచారం. పార్టీ నేతలు, శ్రేణులకు శిక్షణ ఇవ్వడం, గ్రంథాలయాలు, సెమినార్ హాల్స్, వసతి సౌకర్యం ఉండేలా భవనాన్ని నిర్మించనున్నారు.