నన్ను గెలిపిస్తే విజయయాత్ర- లేదంటే శవయాత్ర : కౌశిక్ రెడ్డి - కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచారం
Published : Nov 28, 2023, 2:56 PM IST
BRS Candidate Koushik Reddy Interesting Comments: ఎన్నికల మరో రెండు రోజులు ఉన్నాయి.. ప్రచారం నేటితో ముగియనుంది. దాదాపు ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు గెలుపు ఓటములు నిర్ణయించుకునే సమయం ఇది. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్(BRS) అభ్యర్థి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను గెలిపిస్తే విజయయాత్ర చేస్తానని.. లేదంటే తన శవయాత్రలో ప్రజలు పాల్గొనాల్సి ఉంటుందని భావోద్వేగానికి గురైయ్యారు.
Koushik Reddy Election Campaign: కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో కౌశిక్‌రెడ్డి(Koushik Reddy), తన భార్య, కుమార్తెతో పాల్గొన్నారు. దీంతో భావోద్వేగానికి గురైయ్యారు. తనను గెలిపిస్తే.. డిసెంబర్ 4న తేదీన విజయ యాత్రగా వస్తానని తెలిపారు. ఎన్నికల్లో ఓడిపోతే మా ముగ్గురి శవాలు చూడాల్సి ఉంటుందని తెలిపారు. తరువాత మా ముగ్గురి శవయాత్రలో పాల్గొనాల్సి వస్తోందని అన్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి ప్రాధేయపడ్డారు. తాను ఈ ఎన్నికల్లో గెలిస్తే ఏమి చేస్తారనే అంశాలను ప్రజలకు వివరించారు.