మెడలో పూలదండ వెయ్యలేదని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వధువు - ఖగడియా పెళ్లి గొడవ
బిహార్లో విచిత్ర ఘటన జరిగింది. మరికొద్దిక్షణాల్లో పెళ్లి జరగబోతున్న క్రమంలో ఓ వధువు వివాహానికి నిరాకరించింది. ఖగాడియా జిల్లా ముఫాసిల్ ప్రాంతంలో బుధవారం రాత్రి వివాహ వేడుకల్లో భాగంగా పూల దండలు మార్చుకునే సమయంలో వరుడు కొంచెం తడబాటుకు గురయ్యాడు. వధువు మెడలో దండ వేయకుండా సోదరుడితో మాట్లాకుంటూ ఉండిపోయాడు. దీంతో వధువు పెళ్లి కుమారుడికి మతిస్థిమితం సరిగా లేదని గుర్తించి పెళ్లికి నిరాకరించింది. విషయం తెలుసుకున్న వధువు కుటుంబసభ్యులు వరుడితో పాటు అతడి బంధువులను బంధించారు. కొంత సేపటి తర్వాత పోలీసుల చొరవతో వారిని విడిచిపెట్టారు.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST