తెలంగాణ

telangana

Bhadradri Kothagudem district

ETV Bharat / videos

Viral Video : చెరో బుల్లెట్ బైక్​పై నవ దంపతుల రైడ్.. వీడియో వైరల్ - Newlyweds ride on Bullet bike in palwancha

By

Published : Jun 12, 2023, 10:48 PM IST

Bride and Groom Ride on Bullet bikes : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నూతన దంపతులు.. రిసెప్షన్ వేడుక కోసం వినూత్న రీతిలో ఫంక్షన్​హాలుకు చేరుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. పాల్వంచకు చెందిన రవితేజకు.. ఆంధ్రప్రదేశ్​కు చెందిన సింధూ హిమానీతో ఈ నెల 7న వివాహం జరిగింది. ఇందులో భాగంగా రిసెప్షన్ వేడుకను పాల్వంచలో ఏర్పాటు చేశారు. ఈ రిస్పెషన్​కు నవదంపతులు చెరో బుల్లెట్ నడుపుతూ.. వరుడి ఇంటి నుంచి ఫంక్షన్​హాల్​కి చేరుకున్నారు. కొత్త జంట ముందు.. వెనుక కుటుంబ సభ్యులు, బంధువులు సైతం ద్విచక్రవాహనాలపై వారిని అనురించారు. ఈ క్రమంలోనే నూతన దంపతులపై పూలు చల్లుతూ వేడుకగా తీసుకురావడాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు. అంతేకాకుండా.. డీజే పెట్టి బుల్లెట్ బండెక్కి వచ్చేతపా.. పాట పెట్టడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ కొత్త జంట సందడి సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. మరోవైపు వీరు హెల్మెట్​ లేకుండా బైక్​లు డ్రైవ్ చేయడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. మరీ దీనిపై పోలీసులు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

ABOUT THE AUTHOR

...view details