Boy Died After Falling In Water Tank Mahabubabad : పండుగపూట విషాదం.. నీటి సంపులో పడి మూడేళ్ల బాలుడు మృతి - నీటి సంపులో పడి బాలుడు మృతి2023
By Telangana
Published : Sep 2, 2023, 12:53 PM IST
Boy Died After Falling In Water Tank Mahabubabad: తోబుట్టువుకు రాఖీ కట్టేందుకు పుట్టింటికి వెళ్లిన మౌనిక జీవితంలో విషాధ ఛాయలు అలుముకొన్నాయి. తన మూడేళ్ల బాలుడు ఇంటి ఆవరణలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఇంటి ముందున్న నీటి సంపులో పడి మృతి చెందాడు. ఈ హృదయ విదారక ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో జరిగింది.
Tragedy in Rakhi Celebrations Mahabubabad :ఖమ్మం జిల్లా ముత్తగూడెం గ్రామానికి చెందిన నాగరాజు -మౌనిక దంపతులకు కౌశిక్ అనే మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. మౌనిక తన సోదరుడికి రాఖీ కట్టేందుకు తన కుమారుడిని వెంట తీసుకుని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలోని పుట్టింటికి వెళ్లింది. శుక్రవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో కౌశిక్ ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో పక్కన ఉన్న నీటి సంపులో పడి బాలుడు మృతి చెందాడు. బాలుడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారుగా వెతకడం మొదలుపెట్టారు. ఎక్కడా కనిపించకపోవడంతో అనుమానం వచ్చి నీటి సంపులో చూశారు. సంపులో విగతజీవిగా పడి ఉన్న కౌశిక్‌ను చూసి మౌనిక కన్నీరుమున్నీరుగా విలపించింది. వెంటనేక కుటుంబ సభ్యులు కౌశిక్‌ను బయటకు తీసినా.. అప్పటికే మృతి చెందడంతో ఆ కుటుంబమంతా శోకసంద్రంలో మునిగిపోయింది.