తెలంగాణ

telangana

Tamilisai

ETV Bharat / videos

Bonalu at Telangana Raj Bhavan : 'బోనాలకు ఈసారీ ఆహ్వానం అందలేదు' - గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తాజా వార్తలు

By

Published : Jul 16, 2023, 1:56 PM IST

Updated : Jul 16, 2023, 2:48 PM IST

Tamilsai at Telangana Raj Bhavan Bonalu 2023 : హైదరాబాద్‌లో బోనాల పండుగ భాగ్యనగరానికి కొత్త శోభను తీసుకువచ్చింది. ఏటా ఆషాఢమాసంలో జరుపుకునే సంబురాలు ఇవాళ తుదిఘట్టానికి చేరాయి. గోల్కొండలో తొలిబోనంతో ప్రారంభమైన ఉత్సవాలు.. సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాలతో అంగరంగ వైభవంగా జరిగాయి. ఇప్పుడు లాల్‌దర్వాజ శ్రీ సింహవాహిని మహంకాళి బోనాలు కనులపండువగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రాజ్​భవన్​లోని నల్ల పోచమ్మ అమ్మవారికి.. మంగళ వాద్యాల నడుమ గవర్నర్‌ తమిళసై సౌందర రాజన్ బోనం సమర్పించి వడి బియ్యం పోశారు. 

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ బోనాల శుభాకాంక్షలు తెలిపారు. అందరికి అన్ని సౌకర్యాల అందాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ప్రజరలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా బోనాల పండుగ జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఎప్పటిలాగానే ప్రభుత్వం నుంచి బోనాల పండుగకు పిలుపు రాలేదని చెప్పారు. అందుకే రాజభవన్‌లో బోనాల వేడుకలు జరుపుకున్నామని తమిళిసై సౌందర రాజన్ వ్యాఖ్యానించారు. 

Last Updated : Jul 16, 2023, 2:48 PM IST

ABOUT THE AUTHOR

...view details