తెలంగాణ

telangana

Bogatha Waterfalls in Telangana

ETV Bharat / videos

Bogatha Waterfalls in Telangana : పరవళ్లు తొక్కుతున్న బొగత జలపాతం.. అందాలు చూడతరమా... - బొగత జలపాతం వివరాలు

By

Published : Jul 18, 2023, 3:52 PM IST

Bogatha Waterfalls in Mulugu District: తెలంగాణలో రెండో అతిపెద్ద జలపాతంగా పేరుపొందిన బొగత జలపాతం వరద నీటితో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రాష్ట్రంలో కురుస్తోన్న వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల్లోనూ భారీ వర్షాల కారణంగా రెండు రోజులుగా ఎగువన ఉన్న వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీని ప్రభావం వల్ల ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లిలో ఉన్న బొగత జలపాతానికి వరద అధిక మొత్తంలో వచ్చి చేరుతోంది. ఫలితంగా బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఈ అందాలను చూసేందుకు పర్యాటకులు భారీ సంఖ్యలో వస్తున్నారు. ప్రకృతి సోయగాలను తిలకిిస్తూ.. ఆనందంతో మైమరచిపోతున్నారు. మరోవైపు.. వరద తీవ్రత ఎక్కువగా ఉన్నందున సందర్శకులను నీటిలో దిగేందుకు అధికారులు అనుమతించడం లేదు.

ఈ జలపాతం తెలంగాణ నయాగరాగానూ పేరు గాంచింది. ఈ జలపాతాన్ని చేరుకోవాలంటే హైదరాబాద్​ నుంచి 329 కిలోమీటర్లు దూరం ప్రయాణించాలి. రైలు మార్గం గుండా అయితే వరంగల్​ ప్రధాన జంక్షన్​. అక్కడి నుంచి రోడ్డుమార్గాన ఈ జలపాతాన్ని చేరుకోవచ్చు.

ABOUT THE AUTHOR

...view details