తెలంగాణ

telangana

తమిళనాడులో కాలిపోయిన బీఎండబ్ల్యూ లగ్జరీ కారు

ETV Bharat / videos

నడిరోడ్డుపై అగ్నికి ఆహుతైన BMW కారు.. ముందుగానే దూకేసిన డ్రైవర్ - కారు కాలిపోతున్న వీడియో

By

Published : Jul 25, 2023, 6:22 PM IST

BMW Luxury Car Burnt In Tamilnadu : నడిరోడ్డుపై బీఎండబ్ల్యూ లగ్జరీ కారు అగ్నికి ఆహుతైంది. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ ఘటన జరిగింది. మంగళవారం రహదారిపై ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ లగ్జరీ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారు కాలిపోయింది. తిండివనంకు వెళ్తుండగా మార్గమధ్యలో కారులో పొగలు గుర్తించినట్లు డ్రైవర్‌ పార్థసారధి తెలిపాడు. వెంటనే అప్రమత్తమై చెన్నై-తేని జాతీయ రహదారిపైనే కారును నిలిపివేసినట్లు పేర్కొన్నాడు. చాకచక్యంగా కారులో నుంచి బయటకు దూకేసినట్లు వెల్లడించాడు.

ఈ ఘటనలో క్షణాల్లోనే కారు పూర్తిగా మంటల్లో దగ్ధమైంది. సమాచారం అందిన వెంటనే అక్కడకు చేరుకున్న తంబరం అగ్నిమాపక దళాలు.. మంటలు ఆర్పివేశాయి. అయినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే కారు చాలా వరకు మంటల్లో కాలిపోయింది. ఈ క్రమంలోనే చెన్నై-తేని జాతీయ రహదారిపై సుమారు గంటపాటు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ప్రమాదానికి గల కారణాలు ఏంటో ఇంకా తెలియరాలేదని స్థానిక పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు వెల్లడించారు. 

ABOUT THE AUTHOR

...view details