తెలంగాణ

telangana

Soyam Bapurao

ETV Bharat / videos

Soyam Bapurao Hot Comments : 'ఎంపీ ల్యాడ్‌ నిధులతో ఇల్లు కట్టి.. కొడుకు పెళ్లి చేశా' - Soyam Bapurao interesting comments on MP Lad funds

By

Published : Jun 19, 2023, 3:59 PM IST

Updated : Jun 20, 2023, 7:31 PM IST

MP Soyam Bapurao Interesting Comments on MP Lad Funds : ఆదిలాబాద్‌ జిల్లాలో ఎంపీ ల్యాడ్‌ నిధుల వినియోగంపై బీజేపీ ఎంపీ సోయం బాపురావు చేసిన వ్యాఖ్యలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ఇవి రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. తాజాగా కేంద్రం మంజూరు చేసిన ఐదు కోట్ల నిధుల కేటాయింపుపై ఇటీవల పార్టీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలతో తన నివాసంలో సోయం బాపురావు అంతర్గత సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో తొలి రెండు విడతల్లో కేటాయించిన నిధులను పార్టీ శ్రేణులకు కేటాయించలేకపోయానని ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే ఆ నిధులపై వచ్చిన కమిషన్‌లతో ఇంటి నిర్మాణంతో పాటు.. కొడుకు పెళ్లి చేసినట్లుగా పేర్కొన్నారు. మరోవైపు గతంలో ‌ఉన్న ఎంపీలు మొత్తం నిధులు అమ్ముకున్నారని దుయ్యబట్టారు. ఇపుడు వచ్చిన నిధుల్లో పైసా తనకు ఇవ్వన్నక్కర్లేదని.. ఎన్నికల్లో పార్టీకి ప్రయోజనం కలిగేలా పనులు చేయాలని సోయం బాపురావు పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. ఈ విషయంపై సోయ బాపురావు స్పందించారు. ఈ వ్యాఖ్యలు తప్పని ఆయన కొట్టిపారేశారు.

Last Updated : Jun 20, 2023, 7:31 PM IST

ABOUT THE AUTHOR

...view details