BJP MLA Etela Rajender Fires on CM KCR : బీఆర్ఎస్ అభ్యర్ధుల జాబితాలో భూదందాలు చేసే వాళ్లకే టిక్కెట్లు : ఈటల - తెలంగాణ వార్తలు
Published : Aug 26, 2023, 9:55 PM IST
BJP MLA Etela Rajender Fires On CM KCR : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రెండో ఏఎన్ఎంల దీక్షా శిబిరాన్ని సందర్శిచిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వారికి సంఘీభావం ప్రకటించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని దోచుకున్న వారిని తప్ప దీక్షలు చేసేవారిని పట్టించుకోలేదని.. తీవ్రంగా విమర్శించారు. బీఆర్ఎస్ ప్రకటించిన ఆభ్యర్ధుల జాబితాను చూస్తే భూదందాలు చేసే వాళ్లకే టిక్కెట్లు ఇచ్చినట్లు ఉందని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించే పార్టీ బీజేపీయేనని ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా తమ పార్టీనే గెలుస్తుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి.. బీఆర్ఎస్లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలను ఉద్దేశించి... ఓ ఎమ్మెల్సీ చులకనగా మాట్లాడటంపై వారే నిర్ణయం తీసుకోవాలని ఈటల సూచించారు. దళితున్ని సీఎం చేస్తానని మొసలి కన్నీరు కార్చిన కేసీఆర్ దళితులకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వకపోవడం శోచనీయమని అన్నారు. ఈ సమావేశంలో ఈటలతో పాటు గోవా ఎమ్మెల్యే శ్రీకృష్ణ శాల్కార్, బీజేపీ రాష్ట్ర శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.