తెలంగాణ

telangana

bjp meeting in khammam

ETV Bharat / videos

BJP Meeting in Khammam : ఖమ్మంలో రేపు బీజేపీ భారీ బహిరంగసభ... హాజరు కానున్న అమిత్​షా - ఖమ్మం ఎన్నికల వార్తలు

By ETV Bharat Telangana Team

Published : Aug 26, 2023, 6:26 PM IST

BJP Meeting in Khammam : కమలం పార్టీ ఆధ్వర్యంలో 'రైతు గోస బీజేపీ భరోసా' పేరుతో ఖమ్మం జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న సభకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ సభకు కాషాయ పార్టీ అగ్రనేత అమిత్​ షా హాజరుకానుండటంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. దీనికి సుమారు లక్షమంది జనాన్ని సమీకరించాలని ఆ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే ఖమ్మం నగరమంతా కాషాయ జెండాలతో దర్శనమిస్తోంది. మరోవైపు సభకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. స్థానిక ఎస్ఆర్​బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సభ జరగనుండగా, ఆ ఏర్పాట్లను పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, పార్లమెంట్ మాజీ సభ్యుడు గరికపాటి మోహన్​రావు పరిశీలించారు. ఖమ్మం జిల్లాలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని.. అందువల్లనే పార్టీ జాతీయ నాయకత్వం ఇక్కడ దృష్టిపెట్టిందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో ఈ సారి ఏ విధంగానైనా తెలంగాణలో అధికారంలోకి రావాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు పార్టీ శ్రేణుల్ని ఆ దిశగా ఉత్తేజితులను చేస్తోంది. 

ABOUT THE AUTHOR

...view details