ప్రజలు బీఆర్ఎస్ను ఓడించాలనే కాంగ్రెస్‌కు ఓటేశారు - అసలైన గెలుపు బీజేపీదే : లక్ష్మణ్ - హైదరాబాద్‌లో అమిత్ షా
Published : Dec 28, 2023, 8:07 PM IST
BJP Leader Laxman Press Meet : లోక్‌సభ ఎన్నికల్లో 10 స్థానాలకుపైగా ఎంపీ సీట్లు గెలుచుకుంటామని బీజేపీ అగ్రనేత అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారని బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో జరిగిన బీజేపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో అమిత్ షా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు అమిత్ షా శంఖారావం పూరించారన్న లక్ష్మణ్ బీఆర్ఎస్ను ఓడించాలనే కాంగ్రెస్‌కు ఓటేశారని కానీ అసలైన గెలుపు బీజేపీదేనని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ మునిగిపోయిన పడవ, కాంగ్రెస్ మునిగిపోయే పడవ, వికసించే కమలం బీజేపీ అంటూ లక్ష్మణ్ అన్నారు. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను బీజేపీ ఓడించిందని గుర్తు చేశారు. ఈసారి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఓట్లు, సీట్లు రెండూ పెంచుకున్నామని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి గెలిచి సత్తా చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీసీ ముఖ్యమంత్రి నినాదం ఇక బలంగా ముందుకు తీసుకుపోతామని కె.లక్ష్మణ్ చెప్పారు.