తెలంగాణ

telangana

BJP Kishan Reddy on Vikasit Bharat Sankalp Yatra

ETV Bharat / videos

'గ్రామీణ ప్రజలను దేశాభివృద్ధిలో భాగస్వామ్యం చేయడమే భారత్ వికాస్ సంకల్ప యాత్ర లక్ష్యం' - బీజేపీ తాజా వార్తలు

By ETV Bharat Telangana Team

Published : Jan 14, 2024, 9:25 AM IST

BJP Kishan Reddy on Vikasit Bharat Sankalp Yatra : దేశంలోని గ్రామీణ ప్రజలను చైతన్య పరచడంతో పాటు దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడమే భారత్ వికాస్ సంకల్పయాత్ర ముఖ్య లక్ష్యమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని లంబాడి తండా ప్రాంతంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమంలో కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, ఆర్కే సింగ్ పాల్గొన్నారు. 

Vikasit Bharat Sankalp Yatra : కేంద్ర మంత్రులు కిషన్​రెడ్డి, ఆర్కే సింగ్ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించిన స్టాళ్లను సందర్శించి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. పేద ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా ఈ యాత్ర కృషి చేస్తుందని ఆయన వివరించారు. దేశంలోని ప్రజలందరూ సుఖ, సంతోషాలతో జీవించడమేనని ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేశం అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీపడే దిశగా కేంద్రం నిర్మాణాత్మక ప్రణాళికతో ముందుకు సాగుతుందని ఆయన వివరించారు. దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడం కోసం కేంద్ర ప్రభుత్వం పటిష్ఠమైన ప్రణాళికతో అనేక ప్రాజెక్టులను చేపడుతోందని ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు వాటి లబ్ధిదారులను మరింత ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రం ముందుకు సాగుతుందని కేంద్ర విద్యుత్తు పునర్వినియోగ ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details