రేషన్‌కార్డులు ఇవ్వని కేసీఆర్‌కు ఎందుకు ఓటు వేయాలి : బండి సంజయ్ - బండి సంజయ్ కేసీఆర్ పై కామెంట్స్
Published : Nov 25, 2023, 3:28 PM IST
BJP Election Campaign In Telangana 2023 : తెలంగాణ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం దగ్గరపడుతున్న నేపథ్యంలో బీజేపీ ప్రచార జోరును ముమ్మరం చేసింది. కరీంనగర్ జిల్లా ఎలాబోతారం ప్రచారంలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీపై సంజయ్ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఎంతమందికి రెండుపడక గదుల ఇళ్లు వచ్చాయని బండి సంజయ్ ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా మోదీ 3 కోట్ల ఇళ్లు నిర్మించారని తెలిపారు. పదేళ్లలో కేసీఆర్ లబ్దిదారులకు రేషన్‌కార్డులు కూడా ఇవ్వలేదని బండి సంజయ్ ఆరోపించారు. రేషన్‌కార్డులు ఇవ్వని బీఆర్ఎస్, మంత్రి గంగుల కమలాకర్‌కు ఎందుకు ఓటు వేయాలన్నారు.
Bandi Sanjay Fires On KCR :కేసీఆర్ రూ.5 వేలు రైతుబంధు ఇచ్చి.. రూ.10 వేలు లాక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రతి యూరియా బస్తా మీద మోదీ సర్కార్ రూ.2 వేలు రాయితీ ఇస్తోందని చెప్పారు. కేసీఆర్ సర్కారు కౌలు రైతులను గుర్తించటం లేదని సంజయ్ దుయ్యబట్టారు. కేసీఆర్ ఇంట్లో ఐదుగురికి ఉద్యోగాలు వస్తే.. యువతకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వకుండా సీఎం మొండి చేయి చూపిందన్నారు.