Bipin Rawat Pinda Daan : బిపిన్ రావత్ దంపతులకు పిండ ప్రదానం చేసిన కుటుంబ సభ్యులు.. మోక్షం లభించాలని.. - పితృపక్షమాసం చివరి రోజు పిండ ప్రదానం
Published : Oct 14, 2023, 6:21 PM IST
Bipin Rawat Pinda Daan : దేశ మొదటి సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికకు వారి కుటుంబ సభ్యులు బిహార్‌లోని గయాలో పిండ ప్రదానం చేశారు. జనరల్ బిపిన్ రావత్, మధులికల కుటుంబ సభ్యులు గయాకు చేరుకుని పితృపక్షమేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ దంపతులకు మోక్షం లభించాలని కోరుతూ శాస్త్రోక్తంగా పిండ ప్రదాన కార్యక్రమాన్ని రావత్ సోదరుడు, కుమార్తెలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మధులిక సోదరుడు, ఆయన భార్య సైతం పాల్గొన్నారు.
బిపిన్ రావత్ దంపతులకు మోక్షం చేకూరాలని కోరుతూ పిండ ప్రదానం చేయడానికి గయాకు వచ్చామని మధులిక సోదరుడు తెలిపారు. పితృ శ్రాద్ధ, పిండ ప్రదానం, దాన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన తెలియజేశారు.
2021 డిసెంబర్ 8న M1-17v5 హెలికాఫ్టర్ తమిళనాడులోని కూనూర్‌లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్‌తో పాటు ఆయన భార్య మధులిక కూడా మరణించారు. 2020 జనవరి 1 దేశానికి మొదటి చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ ( సీడీఎస్) గా రావత్ నియమితులయ్యారు.