తెలంగాణ

telangana

Bikers escape elephant attack in Mudumalai wildlife sanctuary

ETV Bharat / videos

బైకర్లను టార్గెట్ చేసిన గజరాజు.. లారీ డ్రైవర్​ వల్ల లక్కీగా.. - తమిళనాడు

By

Published : Apr 14, 2023, 10:11 PM IST

అడవి ఏనుగు నుంచి ఇద్దరు బైకర్లు.. త్రుటిలో తప్పించుకున్నారు. ప్రాణాలతో బతికి బయటపడ్డారు. ఈ ఘటన తమిళనాడులోని నీలగిరి ముదుమలై ప్రాంతంలో జరిగింది. గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. అసలేం జరిగిందంటే?

కేరళకు చెందిన ఇద్దరు వ్యక్తులు.. ఓ బైక్​పై ముదుమలై వన్యప్రాణుల అభయారణ్యానికి రైడ్​కు వెళ్లారు. చూట్టూ ఉన్న ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. ఆ సమయంలో ఎదురుగా ఓ అడవి ఏనుగు పరిగెత్తుకుంటూ వచ్చింది. అప్రమత్తమైన ఇద్దరు బైకర్లు.. తమ ముందు వెళ్తున్న ఉన్న లారీ పక్కకు చేరారు. అది గమనించిన గజరాజు.. వారిపై వైపు వెళ్లింది. అప్పుడే చాకచక్యంగా వ్యవహరించిన లారీ డ్రైవర్​.. వాహనాన్ని ఆపి డోర్ తెరిచి వారిద్దరికి లోపలకు రమ్మన్నాడు. వెంటనే ఇద్దరు వ్యక్తులు లారీ ఎక్కేశారు. ఆ తర్వాత లారీ దగ్గరకు వచ్చిన ఏనుగు.. కాసేపు అక్కడ ఉండి వెళ్లిపోయింది. ఈ మొత్తం ఘటనను అటువైపు కారులో వెళ్తున్న వారు వీడియో తీసి సోషల్​మీడియాలో షేర్​ చేశారు. 

ABOUT THE AUTHOR

...view details