తెలంగాణ

telangana

bike hit car

ETV Bharat / videos

వీధి కుక్కల ఛేజింగ్​.. కారును ఢీకొట్టిన స్కూటీ.. గాల్లోకి ఎగిరి.. - కుక్కల దాడికి భయపడి కారును ఢీకొట్టిన మహిళ

By

Published : Apr 4, 2023, 11:24 AM IST

ఒడిశాలో వీధి కుక్కల దాడికి భయపడి బైక్​పై వెళ్తున్న ఓ మహిళ పక్కనే ఆగి ఉన్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్​ నడుపుతున్న మహిళ సహా మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన బ్రహ్మపురలో జరిగింది. ఈ ప్రమాద దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సోమవారం ఉదయం జరిగిందీ ఘటన.  

అసలేం జరిగిందంటే..  
బ్రహ్మపురలోని గాంధీనగర్​కు చెందిన సుప్రియ, ఆమె సోదరి బైక్​పై వెళ్తున్నారు. అలాగే సుప్రియ కుమారుడు కూడా బైక్​ ముందు భాగంలో ఉన్నాడు. అయితే ఒక్కసారిగా వీరి స్కూటీని వీధి కుక్కలు వెంబడించాయి. దీంతో కుక్కలు ఎక్కడ కరుస్తాయో అనే భయంతో సుప్రియ వెనక్కు చూసుకుంటూ వేగంగా స్కూటీని నడిపింది. దీంతో రోడ్డు పక్కనే ఆగి ఉన్న కారును స్కూటీతో ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా ముగ్గురు గాల్లోకి ఎగిరిపడ్డారు.
దేశంలో రోజురోజుకు వీధి కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. రోడ్డుపై వెళ్తున్న పాదచారులు, వాహనదారులపై దాడికి దిగుతున్నాయి. ఇటీవల తెలంగాణలో కూడా చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు.   

ABOUT THE AUTHOR

...view details