దుండగుల బీభత్సం బైక్‌పై వచ్చి ఒకేరోజు ఆరు ప్రాంతాల్లో కాల్పులు - firing incident in bihar
దారిలో వెళ్తున్న వారిని టార్గెట్ చేస్తూ కాల్పులకు తెగబడుతున్నారు బిహార్‌లోని కొందరు ఆకతాయిలు. రెండు నెలల క్రితం బెగుసరాయ్‌లోని జరిగిన కాల్పుల్లో ఒకరు మరణించిన ఘటన మరువక ముందే మరోసారి ఫైరింగ్ జరగడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. సహర్సాలోని సిమ్రీ భక్తియాపుర్లో శుక్రవారం రాత్రి బైక్‌పై వచ్చిన ముగ్గురు ఆకతాయిలు కాల్పులకు పాల్పడ్డారు. వెనకే మరో బైక్‌పై వచ్చిన దుండగులు సైతం కాల్పులు జరిపారు. మొత్తం ఆరు ప్రాంతాల్లో దుండగులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దుకాణదారులు, పాదచారులే లక్ష్యంగా కాల్పులకు తెగబడుతున్నారు. వీరిని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST