Bike Accident Viral Video in Adilabad : నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టిన బైక్.. ప్రమాదవశాత్తు మీద పడిన యాసిడ్.. ఆ తర్వాత..! - యాసిడ్ ప్రమాదం
Published : Aug 31, 2023, 9:56 PM IST
Bike Accident Live Video in Adilabad : రోడ్డు మీద వెళ్తుండగా.. ఓ వ్యక్తిని ద్విచక్రవాహనం ఢీ కొట్టింది. దీంతో ఆ వ్యక్తి దగ్గర ఉన్న యాసిడ్ వాహనదారుడు, వ్యక్తిపై పడి గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని అశోక్ రోడ్డులో వినయ్ అనే యువకుడు బంగారు నగలు కడగటానికి ఉపయోగించే యాసిడ్(Acid)ను తన నగల దుకాణానికి తీసుకెళ్తున్నాడు. మార్గమధ్యలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న అతిక్ అహ్మద్ అనే వ్యక్తి వినయ్‌ను ఢీ కొట్టాడు. దీంతో వినయ్ దగ్గర ఉన్న యాసిడ్ ప్రమాదవశాత్తు ఆ ఇద్దరిపై పడింది. దాంతో వారిద్దరి ముఖాలపై ఉన్న చర్మమంతా నల్లగా కమిలిపోయింది. ఈ ఘటనను గమనించిన స్థానికులు వారికి సాయం చేశారు. వారికి తక్షణమే ప్రథమ చికిత్స అందించారు. బాధితులు యాసిడ్ మంట నుంచి కోలుకున్న తర్వాత స్థానిక ఆసుపత్రికి వెళ్లి.. చికిత్స తీసుకున్నారు. ఈ ప్రమాద దృశ్యాలు పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దీంతో సామాజిక మాధ్యమంలో ప్రస్తుతం వైరల్‌గా మారాయి.