తెలంగాణ

telangana

కటిహార్​ కరెంట్ నిరసన కాల్పుల్లో ట్విస్ట్​.. కాల్చింది పోలీసులు కాదు!

By

Published : Jul 28, 2023, 10:18 PM IST

బీహార్ కటిహార్ పోలీసుల కాల్పులు

Katihar Firing Case : బిహార్ కటిహార్ జిల్లాలో బుధవారం తాము జరిపిన కాల్పుల వల్లే ముగ్గురు నిరసనకారులు చనిపోయారన్నది అవాస్తవమని పోలీసులు ప్రకటించారు. గుర్తుతెలియని వ్యక్తుల కాల్పులు కారణంగానే ఇద్దరు నిరసనకారులు చనిపోయారని తెలిపారు. అందుకు సంబంధించిన ఓ వీడియోను సైతం విడుదల చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరపడం సీసీటీవీలో నమోదైందని పోలీసులు తెలిపారు. ఘటన సమయంలో బాధితులకు పోలీసులకు చాలా దూరం ఉందని వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేశామని.. నిందితుడ్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతామని వారు పేర్కొన్నారు.

ఇదీ జరిగింది..
Bihar Firing Case : జిల్లాలోని బర్సోయి ప్రాంత ఎస్​డీఓ కార్యాలయం వద్ద ఈ ఘర్షణ తలెత్తింది. విద్యుత్ సరఫరాలో అంతరాయాలను నిరసిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.. కొందరు ఆందోళనకారులు వారిపై రాళ్లు రువ్వారు. దీంతో ఘర్షణ మొదలైంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కాల్పులు జరిపారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని ఘటన సమయంలో స్థానికులు ఆరోపించారు. అయితే, పోలీసులు మాత్రం ఒక మృతినే నిర్ధరించారు.

ABOUT THE AUTHOR

...view details