బిహార్‌లో బాల్యవివాహం.. మాకేం తెలీదన్న పోలీసులు! - బిహార్ బాల్య వివాహం
bihar child marriage: బిహార్‌లో బాల్యవివాహానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గయా జిల్లాలోని నక్సల్ ప్రభావిత ప్రాంతమైన దుమారియాలో ఈ పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. బంజారా వర్గానికి చెందిన రెండు కుటుంబాలు.. బాలుడికి, బాలికకు ఓ గుడిలో వివాహం జరిపించాయి. బాలిక స్వస్థలం ఝార్ఖండ్‌లోని హరిహర్‌గంజ్ అని సమాచారం. అయితే, దీనిపై తమకు ఎలాంటి సమాచారం అందలేదని స్థానిక పోలీసులు చెప్పుకొచ్చారు. విషయం జిల్లా మేజిస్ట్రేట్ వరకు వెళ్లింది. దీంతో ఘటనపై విచారణ జరపాలని ఆదేశించారు. అనంతరం బాల వధూవరుల తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST