CBN Family Emotional After Seeing Chandrababu చంద్రబాబును చూసి భావోద్వేగానికి లోనైన భువనేశ్వరి, లోకేశ్.. - chandrababu arrest news
Published : Oct 14, 2023, 7:48 PM IST
|Updated : Oct 14, 2023, 8:47 PM IST
Bhuvaneshwari, Lokesh Emotional After Seeing Chandrababu: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న చంద్రబాబును చూసి.. ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు లోకేశ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. శనివారం జైలులో చంద్రబాబుతో ములాఖత్ అయిన అనంతరం మీడియాతో మాట్లాడాలని భావించినప్పటికీ.. తీవ్ర ఆందోళనకు గురైన భువనేశ్వరి, లోకేశ్.. దు:ఖంతో నేరుగా బస కేంద్రానికి వెళ్లిపోయారు.
Bhuvaneshwari, Lokesh Deeply Worried: రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్ ములాఖత్ అయిన విషయం తెలిసిందే. ములాఖత్ లో భాగంగా చంద్రబాబుని చూసిన భువనేశ్వరి, లోకేశ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ములాఖత్ అనంతరం దు:ఖంతో నేరుగా బస కేంద్రానికి వెళ్లిపోయారు. మానసికంగా చంద్రబాబు నాయుడు ధైర్యంగా ఉన్నప్పటికీ.. శారీరకంగా పలు సమస్యలతో బాధపడుతుండడంపై కుటుంబ సభ్యులు ఆవేదనకు గురవుతున్నారు. అక్టోబర్ 6వ తేదీ ములాఖత్ కి నేటికీ చంద్రబాబులో ఎంతో మార్పు కనిపించడంతో.. భువనేశ్వరి, లోకేశ్ లు తీవ్రంగా కలత చెందినట్లు తెలిసింది. చంద్రబాబును మునుపన్నెడు ఇంత బలహీనంగా చూడలేదనే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో ములాఖత్ అయిన తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్.. ఆయనను చూసి చాలా బాధేసిందని అన్నారు.