తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఇదేం పిచ్చిరా బాబు ఆకాశంలో 4200 అడుగుల ఎత్తులో కవితా పఠనం

By

Published : Dec 10, 2022, 9:06 AM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

ఓ వ్యక్తి ఆకాశంలో 4200 అడుగుల ఎత్తులో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 కవితలను చెప్పాడు. పారాగ్లైడింగ్ చేస్తూ ఈ ఫీట్​ చేశాడు. అటల్​ కశ్యప్ మధ్యప్రదేశ్​​ భోపాల్​కు చెందిన వ్యక్తి. సిక్కింలో ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. అతడికి సాహిత్యం అంటే చాలా ఇష్టం. అందుకే కవితలు రాయడం హాబీగా పెట్టుకున్నాడు. అలా గత ఏడు సంవత్సరాలుగా కవితలు రాసి ప్రచురిస్తున్నాడు. అయితే ఈసారి కూడా 40 కవితలతో తన ఏడో కవితా సంకలనాన్ని ప్రచురించాడు. దానికి బాతేన్​ హమారీ తుమ్హారీ అని పేరు పెట్టాడు. అందరూ కవితలు భూమిపై ఉండి పాడతారు. కానీ దానికి భిన్నంగా చేయాలని ఆకాశాన్ని ఎంచుకున్నాడు. పారాగ్లైడింగ్​ ఇందుకు సరైన మార్గం అని నిర్ణయించుకున్నాడు. అనంతరం టేకాఫ్​, ల్యాండింగ్​తో కలిపి 40 నిమిషాల్లో 4200 అడుగుల ఎత్తులో 40 కవితలను పూర్తి చేశాడు. ఈ ఫీట్​తో ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో స్థానం సంపాదించాడు అటల్ కశ్యప్​. ఏడో కవితా సంపుటితో ఈ ప్రయోగం చేశానని, అయితే తర్వాత ఏం చేస్తానో ఇంకా ఆలోచించలేదు కానీ డిఫరెంట్​గా చేస్తానని చెప్పాడు.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

...view details